తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది.గడచిన ఏడాదిన్నరగా హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్న తెలుగుదేశం పార్టీ చాంబర్ ను రేవంత్ రెడ్డిఈ రోజు ఖాళీ చేశారు. అసెంబ్లీ కార్యాలయానికి వచ్చిన రేవంత్ అనుచరులు, అక్కడి కంప్యూటర్లు, విలువైన ఫైళ్లను తీసుకేల్లారు . ఆపై ఆ గదికి తాళం వేసి తాళం చెవులు తమ వెంట తీసుకెళ్లారు. ఈ ఉదయం అదే గదిలో తెలుగుదేశం శాసనసభాపక్ష పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టిన రేవంత్ రెడ్డి, ఆపై తన అనుయాయుల కోరిక మేరకు ఆ ఆలోచనను విరమించుకున్నారన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని టీడీపీ కార్యాలయం ఖాళీ చేయడంపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.