జబర్దస్త్` షోతో పాపులర్ అయిన కమెడియన్ షకలక శంకర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన `రాజు గారి గది-2` సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే గత కొన్ని సినిమాల్లో సైడ్ యాక్టర్ గా చేసిన శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలనాటి నటుడు నందమూరి తారక రామారావు నటించిన ‘డ్రైవర్ రాముడు’ చిత్రం అప్పట్లో ఎంతటి భారీ విజయం అందుకుందో తెలిసిందే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు మరో ‘డ్రైవర్ రాముడు’ రాబోతున్నాడు.
ప్రముఖ హాస్యనటుడు షకలక శంకర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. అప్పటి చిత్రంలో ఎన్టీఆర్ లారీపై కాలు పెట్టి స్టైల్‌గా పోజిచ్చినట్లే శంకర్ కూడా పోజివ్వడం ఫన్నీగా ఉంది. సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది.
