రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ గురువారం భేటీ అయ్యారు. శాసనసభ శీతాకాల సమావేశాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ను సీఎం కేసీఆర్ కలిసారు . సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, తీర్మానాలను ముఖ్యమంత్రి గవర్నర్కు తెలియజేశారు.మరికొద్ది సేపట్లో తెలంగాణ శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. గురువారం మధ్యాహ్నం టీఆర్ఎస్ శాసనసభాపక్షం కూడా సమావేశం కానుంది.
