కిల్లి కృపారాణి భర్త….. కుమారుడిపై కేసు
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కిల్లి కృపారాణి చక్రం తిప్పారు. అయితే రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదం ఈమె రాజకీయ భవిష్యత్తును సమాధి కట్టింది. అలాంటి కృపారాణి పేరు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. విశాఖలో ఫ్లాటు కబ్జా ఉదంతంలో కృపారాణి భర్త డాక్టర్ రామ్మోహనరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖపట్నం నౌరోజీ రోడ్డులోని గ్రాండ్ బే హోటల్‌కు ఎదురుగా ఉన్న సీడాల్ అపార్ట్‌మెంట్‌లో 6ఏ ఫ్లాట్‌ను కబ్జా చేశారంటూ అపార్ట్‌మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్మోహనరావుతోపాటు అతని కుమారుడు విక్రాంత్‌పై కేసు నమోదు చేశారు. నగరంలోని మహారాణి పేట పోలీసు స్టేషన్‌లో వారిపై అక్రమ చొరబాబు, బెదిరిరింపు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట రమణయ్య తెలిపారు
