తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు .నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరతారు . ఆ పార్టీకి చెందిన అగ్రనేతలతో టచ్ లో ఉన్నాడు .అందుకే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,టీడీఎల్పీ పదవుల నుండి తప్పిస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు .ఈ లేఖపై స్పందించిన చంద్రబాబు నాయుడు తను విదేశాల నుండి తిరిగి వచ్చేవరకు పార్టీ సంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రేవంత్ రెడ్డిను ఆదేశించారు .
మరోపక్క ఇన్నాళ్లూ టీడీపీలో కొనసాగిన సినీ నటి కవిత మహానాడులో జరిగిన పరిణామాల తర్వాత ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మహానాడులో తనకు ప్రాధాన్యం కల్పించలేదంటూ టీడీపీపై బహిరంగ విమర్శలు చేసిన ఆమె పార్టీ మారబోతున్నారు. త్వరలో కవిత బీజేపీ కండువా కప్పుకోనున్నారు.
బుధవారం ఆమె తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని లక్ష్మణే తెలియజేశారు. కవిత తనను కలిశారని.. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది బీజేపీనేనని ఆమె భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశాభివృద్ధిని కాంక్షించే వారిని తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని లక్ష్మణ్ చెప్పారు.