టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలోముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై ఫైర్ అయ్యారు. భూపతిరెడ్డి స్ధానిక నాయకత్వాన్ని కలుపుకుని పోవడంలేదని, అక్కడున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌తో తరచూ గొడవపడడం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వచ్చింది.వాళ్లిద్దరి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ మందలించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌తో రాజీ కుదుర్చుకోవాలని, లేని పక్షంలో పార్టీ తరపున చర్య తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది.ఇటీవల వివాదంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ తప్పేమీలేదని అన్నారు. శ్రీధర్ బాబు చిల్లరగా వ్యవహరించి దొరికిపోయారని, ఈ వ్యవహారంపై ఆ జిల్లా నేతలు సరిగా స్పందించలేదని కేసీఆర్ మండిపడ్డారు.