ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న వీడియోని చూస్తే బాలయ్య కొట్టడంలో తప్పే లేదనిపిస్తోంది. నందమూరి హీరో బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఏదో బార్ అండ్ రెస్టారెంటులో బాలయ్య ఒంటరిగా కూర్చుని స్నాక్స్ తింటున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఆయన పక్క టేబుల్‌లో కూర్చున్న కొందరు యువకులు బాలయ్యకు తెలియకుండా రహస్యంగా ఈ వీడియో తీశారు. ఇది బెంగుళూరులోని ఓ బార్లో తీసిన వీడియో అనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా బాలయ్య ఎక్కడికెళ్లినా ఎవరో ఒకరు ఆయన వెంట ఉంటారు. మరి బాలయ్య ఒంటరిగా కూర్చున్న ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? అనేది చర్చనీయాంశం అయింది.
ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా వారికి సొంతంగా కొన్ని అభిప్రాయాలూ, ఆహారపు అలవాట్లు ఉంటాయి. మరి అలాంటి వాటిని కూడా పబ్లిక్‌లో పెట్టాలని చూస్తే… పట్టుకొని కొట్టక ఏం చేస్తారు.. వారు నిజంగా వీడియో తీస్తున్నట్లు బాలయ్య గమనించి ఉంటే మాత్రం వారికి అక్కడే పేలేది.