మొత్తానికి తన లేటెస్ట్ మూవీ జై లవ కుశతో తారక్ మొదలు పెట్టిన దండయాత్రకు ఎండ్ కార్డు పడింది. జై క్యారెక్టర్‌లాగే ఈ చిత్రం వీర విహారం చేసి చివరకు చల్లబడింది. బయటి శక్తుల సహకారం లేకుండా కేవలం తారక్ నట విశ్వరూపంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను చీల్చి చెండాడి అతని స్టామినా ఏంటో బాక్సీఫీస్‌కు చాటి చెప్పింది. అంతా బాగానే ఉంది కానీ, ఈ మూవీ మాత్రం సేఫ్ జోన్‌లోకి ఎంట్రీ కాలేక పోయింది. చివరి వరకు పోరాడేందకు ప్రయత్నించింది. కానీ ఇతర సినిమాల ప్రభావం కారణంగా కొద్దిపాటి నష్టాలకే చాప చుట్టేసింది. అనుకున్న లక్ష్యాన్ని కూడా అందుకోలేక పోయింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 79.45 షేర్ కొల్లగొట్టినట్లు తెలిసింది.
జనతా గ్యారేజ్ తరువాత ఇది సెకండ్ బిగ్గెస్ట్. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. 58.95 కోట్లు నమోదైనట్లు తెలిసింది. అన్ని ఏరియాల్లోనూ జరిగిన బిజినెస్‌తో పోల్చుకుంటే దాదాపు అన్ని చోట్లా కొద్దిపాటి నష్టాలు మిగిల్చినట్లు రిపోర్ట్స్ వెల్లడించాయి. అయినా మిక్స్‌డ్ టాక్ బరిలో ఇద్దరి చిత్రాలు పోటీలో ఉన్నా తారక్ కేవలం తన నటవిశ్వరూపంతోనే ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం నిజంగా విశేషమని నిపుణులు అంటున్నారు.
ఇక ఏరియాల వారీగా కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నైజా – రూ.16.70 కోట్లు
సీడెడ్ – రూ.12.20 కోట్లు
వైజాగ్ – రూ.7.10 కోట్లు
తూ.గో.- రూ.5.65 కోట్లు
వె.గో – రూ.3.85 కోట్లు
కృష్ణా – రూ4.70 కోట్లు
గుంటూరు – రూ6.15 కోట్లు
నెల్లూరు – రూ2.60 కోట్లు
ఏపీ + తెలంగాణ – రూ58.95 కోట్లు షేర్
కర్ణాటక – రూ8.9 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ2.25 కోట్లు
ఓవర్సీస్ – రూ9.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ79.45 కోట్ల షేర్ రాబట్టింది.
