సీఎం కేసీఆర్ డైనమిక్ లీడర్ అని కేంద్రమంత్రి ఆహ్లువాలియా కొనియాడారు.రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో మిషన్ భగీరథపై ప్రభుత్వ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహ్లువాలియాకు మిషన్ భగీరథపై ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆహ్లువాలియా మాట్లాడుతూ.. ఇంటింటికి మంచినీరు సరఫరా చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. తెలంగాణ ఎంపీలు మిషన్ భగీరథ గురించి కేంద్రమంత్రులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు. ప్రతీ ఒక్కరికి మంచి నీరు అందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం అందరినీ ఆకట్టుకుందన్నారు. మిషన్ భగీరథపై సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం కేంద్రమంత్రి ఆహ్లువాలియా.. సంగారెడ్డి జిల్లా కంది మండలం కౌలంపేట వెళ్లారు.
