టీఆర్‌ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. రైతుల కోసమే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే చేపడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. భూరికార్డుల ప్రక్షాళన సజావుగా సాగుతుందని తుమ్మల తెలిపారు. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు.రైతుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ సర్కార్ కృషి చేస్తోందని.. రైతులకు అవసరమైన అధునాతన యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నమని వెల్లడించారు. యాసంగిలో రికార్డుస్థాయిలో ధాన్యం పండించామని, రూ.17 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. 3 వ్యవసాయ పాలిటెక్నిక్‌లను ఏర్పాటు చేశాం. ప్రతీ మండలంలో గోదాములు నిర్మించాం. మార్కెట్ కమిటీ చైర్మన్‌ల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించినం. పాలమూరు జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఏడున్నర లక్ష ఎకరాలకు సాగునీరిచ్చాం. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు చనిపోయిన వారి పేరుతో కేసులు వేస్తున్నరని తుమ్మల మండిపడ్డారు.
