ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణాల ఆకృతుల గురించి చర్చించడానికి ..రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడడమే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న సంగతి విదితమే .చంద్రబాబు విదేశ పర్యటనలో ఉండగానే ఆయనకు పెద్ద షాక్ .
అందులో భాగంగా తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కొండగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తాజాగా ఒక సంచలన ప్రకటన చేశాడు .అంతకుముందు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ రేవంత్ ను టీడీపీ పార్టీ కార్యక్రమాలను ,టీడీఎల్పీ కార్యక్రమాలను నిర్వహించరాదని తేల్చి చెప్పారు .
దీనికి తోడూ లండన్ నుండి చంద్రబాబు నేను వచ్చే వరకు రేవంత్ పార్టీ సంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఆదేశాలను జారీచేశాడు .దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ “టీడీఎల్పీ నేతను నేనే. సమావేశం నిర్వహించే హక్కు నాకే ఉంది. ఎల్పీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఎల్. రమణ ఎవరు? ఆయన తన పని తాను చూసుకుంటే మంచిది.’అని హితవు పలికారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు .రేవంత్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవడానికే ఇలా మాట్లాడుతున్నాడు .త్వరలోనే ఆయన విదేశాల్లో ఉన్న బాబుకు షాకిచ్చి పార్టీ మారడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు .