ఈ నెల 3న ఆత్మకూర్ మండలం చాడ ముత్తిరెడ్డి గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముస్త్యాలపల్లికి చెందిన పసునూరి రాములు, భార్య రజిత, కూతురు దీక్షితలు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు వారిని హైదరాబాద్ లోని కుషాయిగూడ రాఘవేంద్ర దవఖానలో చికిత్స్ నిమిత్తం తరలించడంతో పాటు విషయాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి తక్షణం వైద్య ఖర్చుల నిమిత్తం 2లక్షల రూ॥లు అందేలా చర్యలు తీసుకున్నారు.
దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన బాధితులు ఎమ్మెల్యేను కలిసిన అనంతరం.. వారితో కొద్దిసేపు మాట్లాడిన ఎమ్మెల్యే ఇంటికి ఎలా వెళ్తారంటూ వారిని ప్రశ్నించారు.. ఆటోలో వెళ్తామని చెప్పడంతో ఆరోగ్యం బాగాలేని ఈ పరిస్థితిల్లో ఆటోలో వెళ్లడం శ్రేయస్కరం కాదంటూ తన వాహనంలో వారిని ఇంటి వద్ద దింపిరావాలంటూ సిబ్బందికి పురమాయించారు.
దీంతో భాదితులు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు.. బాధితులు ఎమ్మెల్యే వాహానాన్ని ఎక్కడం గమనించిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాపతినిధులు ఎమ్మెల్యే సేవ దృక్పదంపై హార్షం వ్యక్తం చేశారు..