రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను మలేషియా హైకమిషనర్ హిదాయత్ అబ్దుల్ హమీద్ కలిశారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి కేటీఆర్ పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాలను, విధానాలు, పెట్టుబడుల సానుకూలతను మలేషియా ప్రతినిధి బృందానికి వివరించారు. అదేవిధంగా ఐటీ కొత్త విభాగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. టీ హబ్ ద్వారా అంకుర సంస్థలు, వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే మలేషియా కంపెనీలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. మలేషియా ప్రతినిధి బృందాన్ని మంత్రి కేటీఆర్ పోచంపల్లి చేనేత శాలువాలతో సత్కరించారు.