ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసర్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ దాదాపు అరువందలకు పైగా ఎన్నికల హామీలను కురిపించింది .అందులో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిను కల్పిస్తాం అని .అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు .
గత మూడున్నర ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చేస్తోన్న పలు నిరసన కార్యక్రమాలు ,పోరాటాల ఫలితంగా బాబు సర్కారు దిగొచ్చింది .ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది .అయితే ఈ పథకానికి అర్హులు కావాలంటే ఐదెకరాల మాగాణి లేదా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ..
వారు డిగ్రీ ,ఐటీఐ ,పాలిటెక్నిక్ ఉత్తీర్ణులై ఉండాలి .ఒకవేళ బీటెక్ చేసిన కానీ దాన్ని డిగ్రీ కింద పరిగణించి నిరుద్యోగ భృతి ఇవ్వాలని బాబు సర్కారు నిర్ణయించినట్లు వార్తలు వస్తోన్నాయి .ఈ పథకానికి అర్హులైన వారు దాదాపు ఏడు లక్షల మంది ఉంటారు అని సర్కారు నిర్వహించిన సర్వేలో తేలింది అని సమాచారం .పద్దెనిమిది నుండి ముప్పై ఐదు యేండ్ల మధ్య ఉన్న యువతకు మాత్రమే నిరుద్యోగ భృతి కింద పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని బాబు నిర్ణయించారు అని సమాచారం .