టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. చిత్రాలు నిర్మించడంలో గీతా ఆర్ట్స్ వారు ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడుతాడని టాక్.. ఎలా అంటే టాలెంట్ ఎక్కడ కనిపించినా గీతాఆర్ట్స్‌వారు వెంటనే బిస్కెట్ వేస్తారు. తాజాగా తీసుకుంటే మనం సినిమా రిలీజ్ అయిన వెంటనే గీతాఆర్ట్స్ నుంచి విక్రమ్ కె.కుమార్‌కి ఫోన్ వెళ్లింది. ఇక బోయపాటిశ్రీను, సురేందర్‌రెడ్డిలకు కూడా అలాంటి బిస్కెట్స్‌నే గీతాఆర్ట్స్ వేసింది. ఇక మారుతి, పరుశురామ్‌తో పాటు ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత వి.ఐ.ఆనంద్ వంటి వారికి కూడా ఫోన్లు వెళ్లాయి. మెగా కాంపౌండ్‌హీరోలు అరడజనుకు పైగా ఉండటంతో ఒకరి కోసం పిలిచి వారు తయారు చేసిన సబ్జెక్ట్‌లను ఒక్కసారిగా మెచ్చుకోకుండా మార్పులు, చేర్పులు చేయించి, మొత్తానికి హిట్ చిత్రం కథను మెగాకాంపౌండ్ తయారు చేసేలా చేస్తుంది. ఫలానా హీరోకి అని దర్శకులకు కాల్ చేసి, చివరకు కథ అవుట్‌పుట్‌ని బట్టి ఎవరికి సూట్ అవుతుందో వారితోనే సినిమాలను నిర్మిస్తారు.
ఏదైనా సినిమా విడుదలై హిట్ అయిందంటే చాలు వారికి అభినందనల పేరుతో ఫోన్ వెళ్లడం, వెంటనే రెండు మూడు చిత్రాలకు అగ్రిమెంట్ చేసుకునే తరహా విధానాన్నివారు పాటిస్తారు. ఒక్కసారి ఓ కథను ఓకే చేయడంతోసరిపోదు.ఆ కథను మెగా కాంపౌండ్‌లోని అందరికీ వినిపించి,వారు చెప్పిన మార్పులు చేర్పులు చేయిస్తారు. మొత్తానికి దర్శకులను ఎంతగా విసిగించినా ఆ దర్శకుడికి లైఫ్ వచ్చేలా చేస్తారు. ఇక తాజాగా పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్’లతో హ్యాట్రిక్‌ని నమోదు చేసిన అనిల్ రావిపూడికి కూడా గీతాఆర్ట్స్ నుంచి కాల్ వెళ్లిందట. కమర్షియల్ కథలు, సాధారణ కథలకే తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని, ఎమోషన్స్‌ని మిక్స్‌చేసి స్టైలిష్‌గా చూపిస్తూ హిట్ కొట్టడం అనిల్‌రావిపూడికి బాగా వర్కౌట్ అవుతోంది. అందునా ఆయన ఆల్‌రెడీ మెగాహీరో సాయి దరమ్ తేజ్‌తో హిట్టు కూడాకొట్టి ఉన్నాడు. దాంతో అల్లుఅర్జున్, అరవింద్‌ల నుంచి అనిల్‌కి కూడా ఫోన్ వెళ్లిందట. అల్లుఅర్జున్ కోసం ఓ కథను సిద్దం చేసుకోమని చెప్పడంతో అనిల్‌రావిపూడి ఎంతో ఆనందంగా ఓ స్టార్‌ని డైరెక్ట్ చేసే అవకాశం కెరీర్ మొదట్లోనే రావడం తన అదృష్టంగా భావిస్తున్నాడని తెలుస్తోంది.