వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన జి.వి.దేవేంద్రరెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవేంద్రరెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్‌కు అత్యంత సన్నిహితులుగా దేవేంద్రరెడ్డి ఉన్నారు. ఇంతకుముందు పార్టీ ఏపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఈ సందర్భంగా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ.. మీడియా కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు అందించినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌కు, పార్టీ పెద్దలు రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, దివ్యారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.