టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. హాట్ చార్మీల మధ్య ఎఫైర్ రూమర్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆ మధ్య పూరీ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ సినిమాలో చార్మి ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత పూరీ కనెక్ట్స్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా చార్మీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరీ తన తనయుడి హీరోగా పెట్టి రూపొందిస్తున్న మెహబూబా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ముహూర్తం షాట్ దగ్గర నుంచినే చార్మి కనిపించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఉత్తరభారతదేశంలో కొనసాగుతుండగా.. యూనిట్ తో పాటు చార్మీ కూడా ఉంటోంది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య ఎఫైర్ కచ్ఛితంగా ఉందని.. పూరీతో చార్మీ సహజీవనం చేస్తోందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయినా పూరీ జగన్నాథ్ వివాహితుడు.. అయినప్పటికీ ఇలాంటి రూమర్ వినిపిస్తుండటం విశేషం. పూరీ, చార్మీల సాన్నిహిత్యమే ఇలాంటి రూమర్ కు దారి తీస్తోంది. అయితే ఈ ప్రచారం గురించి పూరీ కానీ, చార్మీ కానీ ఇంకా నోరు విప్పలేదు. ఇంత వరకూ.. తమ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిచనూ లేదు. ఈ తరహా ప్రేమకథలు సినీ ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. వివాహితులు అయిన దర్శకులను, హీరోలను మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలో చార్మీ కూడా చేరుతుందా.. లేక తమది స్నేహం మాత్రమే అని ప్రకటిస్తుందా.. తెలియాలంటే వేచి చూడాల్సిందే అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.