టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైధీ నెం 150 తో ఘనంగానే చాటుకున్నారు. అయితే ఆ తర్వాత ఓ భారీ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. చారిత్రక నేపద్యం ఉన్న కథని ఎంచుకున్నారు. అదే సైరా నరసింహా రెడ్డి.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇంత వరకు షూటింగ్ మాత్రం పట్టాలు ఎక్కలేదు. దీంతో సైరా ఆలస్యం ఆ సినిమా యూనిట్ కి కొత్త కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది. సైరాలో పనిచేసే సాంకేతిక నిపుణులు ఇప్పుడు డేట్లు సర్దుబాటు చేయలేక నానా తంటాలు పడుతున్నారంట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ సెప్టెంబరులోనే మొదలవ్వాల్సింది. కానీ ఆలస్యమైంది. దాంతో మూవీ యూనిట్ కంగారు పడుతున్నారు.
ఇప్పటికే మరో మూవీకి కమిట్ అయినవాళ్లంతా నెమ్మదిగా జారుకొనే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా సైరా మూవీ యూనిట్ లోని తొలి వికెట్ పడిపోయింది. కెమెరామెన్ రవి వర్మన్ ఈ మూవీ నుండి తప్పుకొన్నారు. కమల్ – శంకర్‌ల భారతీయుడు 2 టీమ్‌లో ఆయన ఉన్నారు. ఈ మూవీ కోసమే సైరా వదులుకోవాల్సి వస్తోంది. ఆయన స్థానంలో సైరా మూవీ కి రత్నవేలుని తీసుకోనున్నట్టు సమాచారం. రత్నవేలు ప్రస్తుతం రంగ స్థలం సినిమాతో బిజీగా ఉన్నాడు. రంగస్థలం పూర్తయిన వెంటనే సైరా ని మొదలెట్టాలన్నది మూవీ యూనిట్ ఆలోచన. అందుకే.. రత్నవేలుని ఎంచుకొంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఖైది నెం. 150కీ కూడా రత్నవేలు పనిచేశారు. సైరా మరింత ఆలస్యమైతే మాత్రం మరికొన్ని వికెట్లు కూడా ఇలాగె పడే అవకాశం లేకపోలేదు.