టాలీవుడ్లో మిరపకాయ్, మిర్చీ లాంటి హిట్ చిత్రాల్లో నటించి హాట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ ఇటీవల సినిమాలకు స్వస్తి చెప్పేసి.. కొత్త జీవితంలోకి ప్రవేశించబోతున్నానని చెప్పి తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరో భామ కూడా సినిమాలకు స్వస్తి చెబుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ అవతారం ఎత్తి వరుస హిట్స్ అందుకున్న ఈ బొద్దుగుమ్మ గత కొన్ని రోజుల నుండి సినిమాలకు దూరంగానే ఉంటుంది.
అయితే మొన్నామధ్యన అవికాకు హీరోయిన్ అవకాశాలు రాకపోవడానికి టాలీవుడ్లో ఒక ప్రముఖ హీరో కారణమని.. అతనే దర్శక నిర్మాతలకు చెప్పి అవికాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడనే ప్రచారం జరిగింది. దీంతో మంచి హిట్స్‌తో ఉన్న హీరోయిన్ ఒక్కసారిగా సినిమాలకు దూరమవడం వంటి విషయాలకు బలం చేకూరేలా ఆ ప్రచారం జరిగింది. అయితే అవికాకు నిజంగానే సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అనేది మాత్రం వాస్తవం. దీంతో బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన అవికా గోర్ .. ఇప్పుడు లాడా-2 సీరియల్లో నటించేందుకు సిద్ధమైందట. మరి హిందీలో ఒక సీరియల్ స్టార్ట్ అయ్యింది అంటే ఆ సీరియల్ సంవత్సరాలు సంవత్సరాలు సాగుతుందనే విషయం తెలిసిందే. దీంతో తనకు బాగా కలిసి వచ్చిన బుల్లితెరను నమ్ముకొని టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి అవికా ఫిక్స్ అయ్యిందని సమాచారం.