ఈ నెల 27న గాంధీ భవన్ నుంచి పాదయాత్రగా వెళ్లి అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ లో సమావేశమైన కిసాన్ సెల్… ఏకగ్రీవ తీర్మానాలు ప్రకటించింది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఇవ్వాలని నిర్ణయించామన్నారు . పత్తి క్వింటాలుకు 5వేలు తగ్గుకుండా చూస్తామన్నారు. నష్టపోయిన మొక్కజొన్న, వరి పంటలకు… ఎకరాకు 15 వేలు, పత్తికి 25 వేల నష్టపరిహారం చెల్లించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
