అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భాగమతి బాహుబలి – 2 తరువాత అనుష్కనుంచి వస్తున్న సినిమా కావడంతో భాగమతిపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్టు ఆ అంచనాలను అందుకునేందుకు దర్శకుడు జీ.అశోక్ చిత్రాన్ని రూపొందించే పనిలో పడ్డాడు. కాగా, ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఎలాగైనా.. నవంబర్ నాటికి సినిమా తొలి కాపీని సిద్ధం చేసి డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.
అయితే, ఇప్పుడు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. భాగమతిలో స్వీటీ డ్యుయల్ రోల్‌లో కనిపించబోతోందట. ఈ విషయం బయటకు పొక్కకుండా.. అభిమానులకు సర్‌ప్రైజ్ ట్రీట్ ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు. కానీ యూనిట్ వర్గాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. భాగమతి టైటిల్ రోల్‌తోపాటు మరో పాత్రలో అనుష్క కనిపించనుంది. ప్రస్తుతానికి అది సస్పెన్స్‌గానే ఉంచుతున్నారు. ఈ రెండు పాత్రలు కూడా సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. మొత్తానికి స్వీటి తన విశ్వరూపం ఈ సినిమా ద్వారా చూపించబోతోందన్నమాట. అనుష్కతోపాటు మరో ముఖ్య పాత్రలో ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్‌లు నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.