పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన టెలీకం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ చివరినాటికి 2జీ మొబైల్ వ్యాపారానికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించింది. అయితే 3జీ, 4జీ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. కంపెనీ కార్యకలాపాలను కుదిస్తున్నందున పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కంపెనీని వీడివెళ్లాలని కోరినట్టు సమాచారం. అయితే దీనిపై ఆర్‌కామ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నెల మొదట్లో ఎయిర్‌సెల్‌తో విలీన ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలోనే అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023