యువ క్రికెటర్లందరికీ.. ఇప్పటికీ ధోనీనే కెప్టెన్ అని స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అంటున్నాడు. కాగా, స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ధోని గురించి ఆసక్తి కర విషయాలను వెల్లడించాడు. భారత కెప్టెన్సీ నుంచి పూర్తి స్థాయిలో తప్పుకున్నప్పటికీ మైదానంలో ధోని కెప్టెన్ తరహా పాత్ర పోషిస్తున్నాడని తెలిపాడు. వికెట్ల వెనుక నిల్చొని బంతులు ఎలా వేయాలో బౌలర్లకు సూచిస్తుంటాడని… అలాగే కెప్టెన్ కోహ్లీకి అవసరమైన సమయంలో సలహాలు ఇస్తాడని చెప్పుకొచ్చాడు. మిడ్ ఆన్, లేదా లాంగ్ ఆన్‌లో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బౌలర్లంతా ధోని సలహాలే తీసుకుంటారన్నారు. ఇలా చేయడం వల్ల బౌలర్లకు సమయం ఆదా అవుతుందని చెప్పాడు చాహల్. అలాగే, ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్ మైండ్‌సెట్‌ను ధోనీ చదవగలదని.. అది ధోనికి ఎలా సాధ్యమైందో తనకి అర్ధం కావడం లేదన్నాడు.