కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేసిన ప్రతిపక్షాలకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఝలక్ ఇచ్చింది . ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ పనులకు పర్యావరణ అనుమతులు లభించాయి. ప్రాజెక్టు పనుల కోసం అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ. 3,168 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం బదలాయించేందుకు అనుమతి ఇచ్చింది. అటవీ డివిజన్ల పరిధిలోని అటవీ భూముల బదలాయింపునకు అనుమతులు వచ్చాయి. మహదేవ్‌పూర్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, బాన్సువాడ, నిర్మల్‌లోని భూముల బదలాయింపునకు అనుమతులు లభించాయి.
