సిగ్గు, ఎగ్గూ లేకుండా పోవడమంటే ఇదే! ఆడ_ మగ , చిన్నా-పెద్ద, పిల్లా-పాప, వృద్ధులూ అందరూ చూస్తుండగా.. బరితెగింపునకు పాల్పడిందో టీమ్. నడిరోడ్డుపై ఇద్దరు మహిళల స్వలింగ సంపర్కానికి సంబంధించిన పోర్న్ మూవీ ప్రోమోను చిత్రీకరించారు.
ఈ ఘటన స్పెయిన్లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై అక్కడి పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. స్పెయిన్లో ప్రతిష్ఠాత్మక శాన్ టెల్మో ప్యాలెస్ వద్ద రోడ్డు, అక్కడే ఉన్న పార్కు, గుర్రపు బగ్గీలో ఈ పోర్న్ మూవీని ప్రోమోను చిత్రకరించారు.
ఒంటిపై నూలుపోగు లేకుండా ఇద్దరు మహిళలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుండటాన్ని నలుగురు వీడియోలో చిత్రకరించారు. ఇందులో ఇద్దరు మహిళ కూడా ఉన్నారు.హఠాత్తుగా తమ ఎదురుగా వచ్చి, బట్టలను విప్పేసిన ఇద్దరు మహిళలు శృంగార చేష్టకు దిగడంతో.. అక్కడే ఉన్న పర్యాటకులు, స్థానికులు బిత్తరపోయారు. ఆ సమయంలో అక్కడ చాలామంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
శాన్ టెల్మో ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో సుమారు 20 నిమిషాల పాటు ఈ చిత్రీకరణ సాగింది. అనంతరం అక్కడి నుంచి జంప్ అయ్యింది షూటింగ్ టీమ్. ఈ ఘటన తరువాత కొందరు.. స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో వారు దీనిపై విచారణకు ఆదేశించారు.