బాలయ్య సినిమాల్లో మాస్ కంటెంట్ ఎంత ఎనర్జెటిక్‌గా ఉంటుందో.. టైటిల్స్ కూడా అంతే వీరోచితంగా ఉంటాయి. ఆ పేర్లు వినగానే.. అదేదో తెలియని పౌరుషం, ఉత్సాహం పొంగి పొర్లుతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇది కదరా..? మనకు కావాల్సిన అసలైన ఎమోషన్ అనే ఫీలింగ్ మాస్ ఆడియన్స్‌లో కలుగుతుంది. అంత పవర్‌ఫుల్‌గా బాలయ్య సినిమాలు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు వహిస్తారు. దీంతో బాలకృష్ణ లేటెస్ట్ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారనే ఆతృత నెలకొంది. ఆ మధ్య కొన్ని పేర్లు చక్కర్లు కొట్టినా.. చివరికి అవి ఫేక్ అని తేలిపోయాయి. మరి టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా..? అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు.
ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. దేనికోసమేతే ఫ్యాన్స్ వేచి చేస్తున్నారో..ఆ టైటిల్‌ను తమ అభిమాన నటుడు మూవీకి యూనిట్ ఫిక్స్ చేసింది. గత సినిమాల తరహాలోనే ఈ మూవీకి కూడా ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్ర బృందం. ఎన్నో పేర్లును పరిశీలించిన అనంతరం జై సింహ అనే టైటిల్‌న ఫిక్స్ చేశారు. కథకి బాలయ్య ఎనర్జీకి బాగా సరిగాపోతుందని భావించి యూనిట్ ఆ పేరును నిర్ణయించింది.
ఇక పేరులో ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీలోని జై లవకుశలో జై ఉండగా..బాలయ్య, బోయపాటి కాంబోలో..ఆ మధ్య వచ్చిన సింహాపేరు ఉండటం విశేషం. ఈ రెండింటిని ఫిక్స్ చేసి జై సింహాగా పెట్టగా నందమూరి ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోతున్నారు. జబర్దస్త్ టైటిల్ పెట్టినందుకు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. ఇకపోతే కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, నతాష నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ కల్యాన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న చిత్ర యూనిట్.