Home / CRIME / ఒక మహిళపై 200 సార్లు లైంగిక దాడి…. సెక్స్‌సోమ్నియా

ఒక మహిళపై 200 సార్లు లైంగిక దాడి…. సెక్స్‌సోమ్నియా

నిద్రలోనే శృంగారంలో పాల్గొనడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజమే. సెక్స్‌స్నోమియా అనే రుగ్మత వచ్చిన వారు ఇలాగే నిద్రలో సెక్స్ చేస్తారట. కానీ ఈ రుగ్మతను కారణంగా చూపి లైంగిక దాడి చేస్తే అని మాత్రం అడగకండి. ఇలాంటి ఘటనే ఇప్పుడు న్యాయస్థానంలో విచారణలో ఉంది.

లారెన్స్ బారిల్లీ అనే ప్రబుద్ధుడు ఒక మహిళపై 200సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతో తన శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. కానీ తాను కావాలని ఇలా చేయలేదంటున్నాడు. సెక్స్‌సోమ్నియా అనే రుగ్మత కారణంగా తనకు తెలియకుండానే నిద్రలో ఇలా చేశానని చెబుతున్నాడు. 35 ఏళ్ల లారెన్స్ బారిల్లీ అనే వ్యక్తి 2011 సెప్టెంబర్ నుంచి మరుసటి ఏడాది అక్టోబర్ వరకు ఓ మహిళపై పలు సందర్భాల్లో ఇలా శృంగారంలో పాల్గొన్నాడు.

ఆమె అతణ్ని ప్రతిఘటించగా.. నిద్రలో తనకు తెలియకుండానే ఇలా చేస్తున్నానని చెప్పాడు. లారెన్స్‌తో బ్రేకప్ అయిన చాలా ఏళ్ల తర్వాత ఆమె అతణ్ని కలిసింది. అప్పుడు లారెన్స్ ఆమెతో ఇలా చేయడంతో.. తిరిగి తనతో అనుబంధాన్ని కోరుకుంటున్నాడని భావించింది. నువ్వు చేసే పని నాకు నచ్చడం లేదని చెప్పగా.. సెక్స్‌సోమ్నియా కారణంగానే తానిలా చేశానని సింపుల్‌గా చెప్పాడు. 2008 నుంచి 2010 మధ్య మరో మహిళను కూడా రేప్ చేశాడని బారిల్లీ మీద ఆరోపణలు ఉన్నాయి.

సెక్స్‌సోమ్నియా డిజార్డర్ ఉన్నవారు నిద్రలోనే లైంగిక చర్యకు ఉపక్రమిస్తారని థెరపిస్టులు చెబుతున్నారు. ఈ రుగ్మతతో బాధపడేవారు రాత్రి నిద్రలో సెక్స్ చేసినప్పటికీ.. మరుసటి రోజు ఉదయం వారికి ఆ సంగతి గుర్తు ఉండదట.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat