ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్ కచ్చితమా లేదా అనే అంశంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై పలు స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు వేశాయి. వాదనలు విన్న సుప్రీం కోర్టు.. అక్టోబర్ 30కి వాయిదా వేసింది. అయితే ఆధార్ తప్పనిసరి చివరి తేదీని వచ్చే ఏడాది మార్చి 31కి పొడిగించినట్టు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది కేంద్రం. గతంలో ఇది 2017 డిసెంబర్ 31 వరకు ఉండేది. ఈ పొడిగింపు కేవలం ఆధార్ నంబర్ లేని వారికి మాత్రమేనని స్పష్టం చేసింది కేంద్రం.ఇదిలా ఉంటే.. ఆధార్ లింక్ వద్దనుకునే వారికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు కేంద్రం. కేవలం తుది గడువు పొడిగింపుపై మాత్రమే వివరణ ఇచ్చింది. తుది తీర్పు వచ్చే వరకు ఆధార్ పై స్పష్టత ఉండదంటున్నారు న్యాయ నిపుణులు.
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023