రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలు, వివిధ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలను ఉర్దూ భాషలోనూ నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటికే విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కసరత్తును తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే మొదలు పెట్టింది. కాగా.. దేశ వ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను ఉర్దూలోనూ నిర్వహించేలా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఉర్దూ భాషలోనే ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
