ఒక సినిమా తీయడానికి కాంబినేషన్ అంతా సెట్ అయినప్పుడు తారలు ఎంత బిజీగా ఉన్నా కూడా చిత్ర నిర్మాతలు షూటింగ్ మొదలు పెడితే ఓ పనైపోతుంది అనుకుని ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతారు. హీరోలు కూడా షెడ్యూల్స్‌ను సైతం ఛేంజ్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా ఒక హీరో కోసం మరో హీరో తన షెడ్యూల్‌ను త్యాగం చేశాడు. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిన విషయమే.. తన 25వ సినిమా చేస్తూనే.. రాజకీయాల వైపు కూడా అడుగులు వేస్తున్నారు.. బిజీ షెడ్యూల్ వల్ల పవన్ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడం లేదు. సినిమాను త్వరగా పూర్తి చేసి రెగ్యులర్‌గా రాజకీయాల్లో పాల్గొనేందుకు ఏ మాత్రం తీరిక లేకుండా.. పని చేస్తున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చివరి షెడ్యూల్ యూరోప్‌లో జరగనుంది. అయితే ఎన్టీ ఆర్ కోసం తన షెడ్యూల్‌ను వాయిదా వేసుకున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో.. ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా రామానాయుడు సినిమా స్టుడియోలో. .నిన్న ప్రారంభమైంది. నిర్మాతలు సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడంతో దర్శకుడు త్రివిక్రమ్ ఉండాలి కాబట్టి పవన్ రెండ్రోజుల తరువాత యూరప్‌కి ప్రయాణమవుతున్నారట. అంతే కాకుండా ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కూడా విచ్చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు.