విశాల్ ఇంటిపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ టీమ్ దాడులు చేసిందన్న వార్తలతో కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చెన్నైలోని వడపల్లిలో ఉన్న విశాల్ ఇల్లు.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కార్యాలయానికి మీడియా క్యూ కట్టింది. అయితే విశాల్ ఇంటిపై తామేమి దాడి చేయలేదని జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వివరణ ఇచ్చింది. టీడీఎస్ బకాయిలపై ఎంక్వైరీ కోసం ఐటీ అధికారులు వచ్చారని విశాల్ క్లారిటీ ఇవ్వడంతో వివాదం సర్దు మనిగింది. మరో వైపు తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్‌గా సినీ ఇండస్ర్టీ తరుపున చురుగ్గా పోరాటాలు చేస్తున్న హీరో విశాల్‌ను కేంద్రం టార్గెట్ చేసిందని చెన్నైలో ప్రచారం జరిగింది. కొద్ది రోజుల క్రితం విజయ్ మెర్సల్ మూవీని ఆన్‌లైన్‌లో చూశానన్న బీజేపీ నేత రాజా కామెంట్లపై విశాల్ తీవ్రంగా స్పందించారు. అందుకే కేంద్రం కక్షకట్టి విశాల్ ఇల్లు, కార్యాలయంపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో దాడులు చేయించిందని పుకార్లు షికారు చేసింది.
