భూమ్మీద నూకలు ఉండాలేకాని.. ఎలా దూసుకు వచ్చినా మృత్యువు ఏం చేయలేదు. అర్జెంటీనాలో జరిగిన ఈ ఘటన ఇందుకు ఉదాహరణ. పిడుగు మీద పడ్డా ఓ పిల్లాడు క్షేమంగా బయటపడ్డాడు. వర్షం పడుతుండటంతో ఓ పిల్లాడు గొడుగుపట్టుకుని ఇంటి బయట ఆటలాడటం మొదలు పెట్టాడు. లోపలి నుంచి ఆమె తల్లి వీడియో తీస్తుంది. గొడుగుతో నాన్‌లోకి వెళ్లిన వెంటనే ఓ పెద్ద మెరుపు అంతే.. పిల్లాడు పక్కకు పడిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాక ఆ తల్లి నిర్ఘాంతపోయింది. కాసేపటికి తీరుకుని అక్కడకు పరుగులు తీసింది. అయితే పిడుగు మీదపడ్డా.. ఆ పిల్లాడు ప్రాణాలతో బయట పడటం నిజంగా అద్భుతమే.
