టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంభందించి ఇప్పటివరకు చిరంజీవి ఫస్ట్ లుక్ ని మాత్రమే విడుదల చేశారు. అయితే షూటింగ్ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అనేది ఇంక కన్ఫామ్ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంభందించి ఒక వార్త నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఆ వార్త ఏంటి అంటే సైరా నరసింహరెడ్డి డిజిటల్ రైట్స్ అమెజాన్ సంస్థ 30 కోట్లు ఇచ్చి కొనుక్కుంది సమాచారం.
అయితే దీనిపై కొణిదెల సంస్థ కాని అమెజాన్ కాని ఎటువంటి ప్రకటన చేయలేదు. డీల్ అయితే వచ్చింది కాని అమౌంట్ ఎంత అనేది మాత్రం ఇంకా తెలియదని, 30 కోట్లు అనేది చాలా పెద్ద మొత్తమని, ఒక భారీ బడ్జెట్ సినిమా తీసేంత డబ్బుతో కేవలం డిజిటల్ రైట్స్ కొంటారా అనే ప్రశ్న కూడా రైజ్ అవుతోంది. ఇందులో శాటిలైట్ హక్కులు లేవు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్, పోస్టర్స్, ప్రైమ్ వీడియోలో సినిమా టెలికాస్ట్ వీటికే ఇంత మొత్తం అంటున్నారు. షూటింగ్ మొదలు కాకుండా ఇంకా చాలా విషయాలు తేలకుండా అంత పెద్ద మొత్తం పెట్టరని, ఇవన్నీ పుకార్లే అని మరికొంత మంది వాదిస్తున్నారు.