టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహరజ్ రవితేజ.. రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడం, పైగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పటాస్, సుప్రీమ్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో రాజా ది గ్రేట్పై రిలీజ్కు ముందునుంచే అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా గత బుధవారం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ అనిపించుకుంటూ ఆరు రోజులకు.. ట్రేడ్ వర్గాలు ఊహించని విధంగా రూ. 34 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా ఏపీ, తెలంగాణలోనే రూ.18.73 కోట్ల షేర్ వసూలు చేసింది. రవితేజకు ఇవి కెరీర్ పరంగా బెస్ట్ వసూల్లుగా ఉన్నాయి. ఇక సినిమాకు పోటీ సినిమాలు లేకపోవడంతో పాటు రాజు గారి గది 2 బాక్సాఫీస్ వద్ద డల్ అవ్వడం ఈ సినిమాకు బాగా కలిసిరానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సేఫ్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇదే విధంగా కలెక్షన్స్ రాబడితే బయ్యర్ల కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల అంచనా వేస్తున్నారు.