టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అథితిగా హాజరయ్యాడు. దాంతో సినీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి ఏర్పడింది ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ లకు అంతగా వెళ్లని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆ సినిమాకు దర్శకులు త్రివిక్రమ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యాడని.. రకరకాలుగా అనుకుంటున్నారు కానీ పవన్ మాత్రం ఎన్టీఆర్ సినిమాకు క్లాప్ కొట్టడానికి వేరే కారణం ఉందని సమాచారం.
అసలు విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రానికి నిర్మాత త్రివిక్రమ్ స్నేహితుడు రాధాకృష్ణ. అయితే పవన్ కళ్యాణ్‌కు కూడా ఆ సినిమాలో కొంత వాటా ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో జనసేన ఎన్నికల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయ పార్టీ అనగానే ఖర్చులు పెద్ద ఎత్తున ఉంటాయని.. దాంతో ఎన్నికల నిధులను సమకూర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇలా ప్లాన్ చేస్తున్నాడట . ఇప్పటికే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో పవన్ కళ్యాణ్ వాటాదారుడు. అలాగే ఎన్టీఆర్ సినిమాని నిర్మిస్తున్న రాధాకృష్ణకు సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు కూడా కొంత వాటా ఉండడంతోనే గెస్ట్‌గా వచ్చి మరీ క్లాప్ కొట్టాడని సమాచారం.