తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ,మంత్రులపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చెందిన నేతలపై మీడియా సాక్షిగా ఆరోపణలు విమర్శలు చేసిన కానీ ఆ పార్టీకి చెందిన నేతలు నోరు మెదపలేదు .
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ,మంత్రి పరిటాల సునీత ,సీనియర్ నేత ,ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పలు కాంట్రాక్టులను పొందుతున్నారు .పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు .ఈ ఆరోపణలపై స్పందించిన టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు .
ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రేవంత్ కు బెయిల్ తెప్పించడంలో నేను ఎంతగానో కష్టపడ్డాను .ఈ విషయం గురించి రేవంత్ రెడ్డికి తెలుసు .ఆయన దగ్గర ఓటుకు నోటు కేసు వ్యవహారం ఉంటె మాదగ్గర తారా చౌదరి వ్యవహారం ఉంది .అందుకు తగ్గట్లు నడుచుకోవాలని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి .అయితే అప్పట్లో తారా చౌదరి కి రేవంత్ కు మధ్య సంబంధాలు ఉన్నాయి వార్తలు హాల్ చల్ చేశాయి .