టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టీ కోశాధికారి.. స్వయానా మోహన్ బాబు బావమరిది.. మేడసాని వెంకటాద్రినాయుడు సోమవారం రాత్రి గుండె పోటుతో మరణించారు. ఈయన వయసు 55 ఏళ్లు. చంద్రగిరి మండలం నారావారిపల్లెకు చెందిన ఈయన, మోహన్‌బాబు చెల్లెలు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు.
అంతే కాదు మోహన్‌బాబు నటించిన కొన్ని సినిమాలకు నిర్మాత గానూ వ్యవహరించి సినిమాల పట్ల తన మక్కువ ను తెలియజేసారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్త పరిచారు. ఇక వెంకటాద్రినాయుడు మరణం తెలియగానే నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక వెంకటాద్రినాయుడి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన్ బాబు ఫ్యామిలీ సభ్యులంతా అక్కడే ఉన్నారు.