Home / MOVIES / మోదీ బ్యాచ్‌కి సినిమా చూపిస్తున్న మెర్స‌ల్‌..!

మోదీ బ్యాచ్‌కి సినిమా చూపిస్తున్న మెర్స‌ల్‌..!

త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ చిత్రం వివాదాల‌తో దేశంలో సంచ‌ల‌నంగా మారింది. ఆ చిత్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని సీన్స్ నిజంగా ఉన్నప్పటికీ.. బీజేపీ కెలుక్కొని మ‌రీ ఇప్పుడు త‌న మీద‌కి తెచ్చుకుంది. మెర్స‌ల్ చిత్రంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ పేలిన డైలాగ్స్ విష‌యంలో అన‌వ‌స‌రంగా రాద్ధాంతం చేసి.. చినికి చినికి గాలి వానలా మార్చి చివరకు తమ కొంప మీదకు తెచ్చుకోవడంతో కమలనాథులు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది.

ఇప్ప‌టికే సౌత్‌లో బలపడాలని నానా తంటాలు ప‌డుతున్న‌ బీజేపీఇప్పటికే కేరళలో చేతులు కాల్చుకుంది. తాజాగా తమిళనాడులో అన్నాడీఎంకే నెమ్మదిగా కాషాయిరూపం దాల్చుతుందని భావిస్తున్న తరుణంలో మెర్సల్ సాక్షిగా పెనుముప్పు తెచ్చుకుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలతో తనకు గిట్టని వాళ్ల మీద సీబీఐ, ఈడీలను ప్రయోగించడం ద్వారా దారికి తెచ్చుకునే మార్గాన్ని అనుసరిస్తున్న మోడీ తాజాగా తమిళనాడులో కూడా అదే తీరు కొనసాగించారు. అదే ఇప్పుడు అసలుకే ఎసరుపెట్టేలా కనిపిస్తోంది. మెర్సల్ అంటే అర్థం షాక్ కాబట్టి నిజంగానే కాషాయి శ్రేణులకు షాక్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ వర్సెస్ తమిళనాడు అన్నట్టుగా పరిణామాలు మార‌డంతో హస్తిన కమలనాథుల్లో కలవరం కనిపిస్తోంది.

ఇక తాజాగా జీఎస్టీ విషయంలో బీజేపీ తీరు మీద సినిమాకు మద్ధతుగా పలువురు ముందుకొచ్చారు. అందులో రజనీకాంత్ కూడా చేరిపోవడంతో బీజేపీ ఆశలకు పెద్ద గండిపడినట్టే కనిపిస్తోంది. కమల్ హాసన్, కుష్బూ, శరత్ కుమార్ వంటి వారు మాట్లాడడం వేరు..,అయితే రజనీకాంత్ మెర్సల్‌ను మెచ్చుకోవడం వేరు అన్నట్టుగా మారుతోంది. దాంతో తమిళనాట జల్లికట్టు తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా కోలీవుడ్ కదులుతోంది. అందుకు తగ్గట్టుగానే జీఎస్టీ అధికారులను నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ మీదకు ఉసిగొల్పడంతో బీజేపీ కష్టాలు రెట్టింపు అవ‌డం ఖాయంగా ఉంది. బీజేపీ తీరును తప్పుబడుతూ ఆపార్టీ నాయకుడు పైరసీ సీడీ చూశానని చెప్పగానే ఘాటుగా స్పందించిన విశాల్ మీద జీఎస్టీ సిబ్బంది దాడులకు పాల్పడడం ద్వారా దారికి తెచ్చుకోవాలని చూడడం మోడీ అవివేకానికి నిదర్శమని తమిళపెద్దలు భావిస్తున్నారు. విశాల్ లాంటి వ్యక్తి మీద దాడులు చేయడం తమిళనాట ఆగ్రహాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుందని చెబుతున్నారు.

ఇక అదే సమయంలో విజయ్ మీద క్రిస్టియన్ మత నేపథ్యాన్ని ముందుకు తీసుకొచ్చి వ్యక్తిగత దాడికి బీజేపీ ప్రయత్నించడం తమిళనాడులో ఉన్న కొద్దిపాటి బలాన్ని కోల్పోవడానికే దోహదపడేలా ఉంది. మొత్తంగా బీజేపీ దక్షిణాది ఆశలకు ఇప్పటికే కేరళలో గండిపడగా.. తమిళనాడు అది మరింత పెద్దదిగా మారబోతోంది. బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలు బాగా దూరం అన్నట్టుగా మారుతోంది. ఇప్పటికే కమల్ హాసన్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ రంగం వైపు కాలుదువ్వుతుందగా.. తాజాగా విజయ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తే బీజేపీకి తాజా పరిణామాలు పెను నష్టమే తెస్తాయని చెప్పక తప్పదు. దేశంలో ఇప్ప‌టికే మ‌స‌క‌బారుతున్న మోదీజీ చ‌రిష్మా.. మెర్స‌ల్ వివాదం బీజేపీకి ఫుల్ డ్యామేజీ అయ్యేట్టు ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat