ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన జగన్ గురించి మాట్లాడారు .
ఆ ఇంటర్వ్యూ లో టీడీపీ నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది .ఆయన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆరోపిస్తున్నారు .దీనిపై మీ కామెంట్ ఏమిటి అని కేఈ ను ప్రశ్నించారు .దీనికి సమాధానంగా కేఈ మాట్లాడుతూ “జగన్ పని అయిపోయింది అని అనడం కరెక్ట్ కాదు .ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు .అంతగా ఆదరణ లేకపోతే జగన్ పెట్టె సభలకు జనాలు అంతగా రారు .జగన్ ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు అని అర్ధమవుతుంది .
ఆయన దాన్ని అధిగమిస్తే జగన్ ను తట్టుకోవడం కష్టం .ఎందుకంటే ఇప్పటికే జనాల్లో ఆయన మంచి క్రేజ్ ను తెచ్చుకున్నారు .అయితే ఇంత క్రేజ్ ఉన్న జగన్ పార్టీలో నుండి ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి ఎందుకు వస్తోన్నారు అనే విషయం అందరికి తెల్సిందే .పార్టీ మారిన సమయంలో ఆ పార్టీ మీద ,ఆ పార్టీ అధినేత మీద విమర్శలు చేయడం గమనార్హం .అంతమాత్రాన వాటినిజనాలు పట్టించుకుంటారు అని అనుకోవడం వివేకం .జగన్ దెబ్బ తిన్న పులి .ఎప్పటికి అయిన ప్రమాదమే అని ఆయన జగన్ కు మద్దతుగా కేఈ మాట్లాడటం ఆ ఇంటర్వ్యూ చూసినవారికి ఆశ్చర్యంతో పాటుగా పలు అనుమానాలను కల్గించింది .బహుశా ఆయన త్వరలో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారేమో అని అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు .