ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే అధికారాన్నికోల్పోయిన సంగతి తెల్సిందే .అయితే ఈ సారి ఏవిధంగా అయిన సరే గెలిచి అధికారాన్ని చేపట్టాలని వైసీపీ పక్క ప్రణాళికలు వేస్తోంది .ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల గురించి ఒకవార్త తెగ ప్రచారం జరుగుతుంది .అదే నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలతో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు .
ఈ భేటీ సందర్భంగా ఎమ్మెల్యేలు త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదు అని నిర్ణయం తీసుకున్నారు .ఈ విషయంపై త్వరలో జరగనున్న భేటీలో తేలనున్నది అని శాసనసభ పక్షఉప నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీడియాకు తెలిపారు .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించకుండా టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా స్పీకర్ కోడెల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు .
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు సభకు పోకపోవడం లాభం కంటే నష్టాన్నే ఎక్కువగా మిగులుస్తుంది .ప్రజలు తమ సమస్యలు తీరుస్తారు అని ..తమకు అన్ని విధాలుగా అండగా ఉంటారు అని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే అధికార పక్షం మీద ఉన్న కోపంతో ఇలా సభకు హాజరు కాకపోవడంపై నియోజక వర్గ ప్రజలకు బ్యాడ్ సంకేతాలు పోతాయి .అంతే కాకుండా ప్రజలకోసం జరిగే పలు కార్యక్రమాల చర్చలో ..బిల్లుల విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే అవి ప్రజలకు మంచి చేస్తాయా ..చెడు చేస్తాయా అని చెప్పడానికి వీలు లేకుండా పోతుంది . అంతే కాకుండా అధికార పార్టీ మీద ,స్పీకర్ మీద న్యాయ పోరాటం చేయచ్చు .అంతే కానీ ప్రజలకోసం జరిగే చర్చల్లో పాల్గొనకుండా ఇలా బహిష్కరించడం వైసీపీకి నష్టమే కానీ ఎటువంటి లాభం ఉండదు .ఇలా అయితే జగన్ కు గడ్డు కాలమే ..!