తెలుగు బుల్లితెర పై దూసుకువచ్చిన ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రాం బిగ్ బాస్‌తో రాత్రికి రాత్రే సెలబ్రటీలుగా మారిపోయారు హరితేజ, ఆదర్శ్. ఇక తాజాగా ఆలీ హోస్ట్‌గా చేస్తున్న ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి గెస్ట్‌గా వచ్చారు. ముఖ్యంగా హరితేజ ఆప్రోగ్రాంలో ఎక్కువగా సందడి చేసింది. అయితే ఈ షోలో తన ఫ్యామిలీకి సంబంధించి చాలా విషయాలను పంచుకుంది.
తాను పుట్టి పెరిగిందీ అంతా తిరుపతి అని కానీ ఇపుడు కెరీర్ రీత్యా హైదరాబాద్‌లో సెటిలయ్యామని హరితేజ చెప్పింది. ఓ కన్నడిగుడితో సినీఫక్కీలో తన పెళ్లి జరిగిందని చెప్పింది. అయితే తర్వాత ఆలీ అడిగిన ఒక ప్రశ్నకు హరితేజ ఒక్కసారిగా షాక్కి గురి అయ్యింది. ఆలీ ప్రశ్నిస్తూ మీ భర్త కాకుండా ఇంకెవరి పైన అయినా క్రష్ ఉందా అని అడుగగా.. ఒకప్పుడు చిరంజీవి గారంటే చాలా క్రష్ ఉండేదని.. ఆతర్వాత అల్లు అర్జున్ మీదకి ఆ క్రష్ షిప్ట్ అయ్యిందని.. ఆ విషయం బన్నీకి కూడా తెలుసని చెప్పింది. ఆ విషయం ఒకసారి బన్నీ నాతో చెప్పగా నేనే సిగ్గుతో చచ్చిపోయాయని చెప్పి ఆలీ ప్రోగ్రాంలో రచ్చ రచ్చ చేసింది హరితేజ.