బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన యాంకర్ రష్మీ గౌతమ్ అప్పుడప్పుడూ వెండి తెర మీద కూడా మెరుస్తోంది. ఇక గతంలో గుంటూర్ టాకీస్ చిత్రంలో రష్మీ ఎలా రెచ్చిపోయిందో గుర్తుండే ఉంటుంది. ఆమె హోయలు చూసి బీసీ సెంటర్ ఆడియన్స్ ప్లాట్ అయిపోయారు. ఫ్లాప్ సినిమాకి అన్ని వసూళ్లు దక్కాయంటే, సేఫ్ ప్రాజెక్టుగా నిలబడిందంటే.. దానికి కారణం రష్మీనే. ఇప్పుడు మరోసారి అలాంటి హాట్ ప్రదర్శన చేయడానికి రెడీ అయిపోయింది.
డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది కధానాయకుడిగా, రష్మీ కీలకపాత్రలో నటించిన చిత్రం నెక్ట్స్ నువ్వే. ఇక ఈ సినిమా ట్రైలర్‌లో హాట్‌గా కనిపించింది రష్మీ. అయితే ఇది ట్రైలర్ వరకే నని తన పాత్ర ఈ చిత్రంలో అంతా హాట్‌గా ఏమీ వుండదని చెబుతోందని రష్మీ. అంతే కాకుండా తాను కావాలని ఎక్స్ పోజింగ్ చేయడం లేదని, సినిమాలో కథ, సందర్భాన్ని బట్టి దుస్తుల ఎంపిక ఉంటుందని, ఇతర హీరోయిన్లతో పోలిస్తే తాను వారిలో కనీసం 30 శాతం కూడా ఎక్స్ పోజ్ చేయడం లేదని.. నెక్ట్స్ నువ్వే చిత్రంలో కూడా తన పాత్ర పరిధి మేరకే అలా కనిపిస్తానని ఈ హాట్ యాంకర్ చెప్పుకొచ్చింది.