మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రాములునాయక్ మీడియాతో మాట్లాడుతూ..గిరిజన గూడెంలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్ పెంచాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ కు గిరిజనులంతా రుణపడి ఉంటారని చెప్పారు. టీఆర్ఎస్ తప్ప మిగిలిన పార్టీలన్నీ ఎస్టీలను ఓటు బ్యాంకులుగానే చూశాయని రాములు నాయక్ విమర్శించారు. అధికార పీఠంపై ప్రతిపక్షాలు కంటున్న కలలు కల్లలుగానే మిగులుతాయని స్పష్టం చేశారు.
