భార్యాభర్తల మధ్య జరిగిన గొడువ కారణంగా భార్య తన భర్త మర్మాంగాన్ని కోసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. సిరిసేడుకు చెందిన రౌతు రవీందర్, స్వరూపకు 25 ఏండ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి పని చేసిన కూలీ డబ్బులను యజమాని నుంచి తీసుకున్న రవీందర్ ఆ మొత్తంతో సోమవారం పీకలదాకా మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన రవీందర్‌ను కూలీ డబ్బుల గురించి భార్య ఆరా తీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఉన్న డబ్బులన్నీ తాగుడుకే తగిలేస్తావా అంటూ ఆగ్రహానికి గురైన స్వరూప.. కూరగాయలు కోసే కత్తితో భర్త మర్మాంగాన్ని కోసివేసింది.అతను కేకలు వేయడంతో చుట్ట్టుపక్కల వారు వచ్చి విషయం తెలుసుకుని రవీందర్‌ను జమ్మికుంట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
