ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లను తాగుతున్నారా? అయితే జాగ్రత్త..! ఈ బాటిల్డ్ నీళ్ల వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. రుచిగా ఉన్నాయని, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయని.. అన్నింటినీ మించి సురక్షితమైన నీరని బాటిళ్లను కొంటున్నాం. కానీ ఆ బాటిల్ నీరు.. అతి ప్రమాదకరం. రుచిగా ఉండేందుకు వాటర్ కంపెనీలు.. పలు రకాల రసాయనాలు, చక్కెరలను కలుపుతున్నాయి. అంతేకాదు ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి హానికారకమైన విష రసాయనాలు విడుదలవుతుంటాయి. అవి మనం తినే ఆహారం, తాగే నీటితో కలిసిపోయి… తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తాయి. అందుకే బాటిల్ వాటర్ తాగే ముందు.. ఒక్కసారి వాటి గురించి తెలుసుకొని తాగండి.ఒకసారి ఉపయోగించిన బాటిల్‌ను.. మళ్లీ మళ్లీ వాడడం మంచిది కాదు. టాయిలెట్ సీట్‌పై ఎన్ని క్రిములు ఉంటాయో… ప్లాస్టిక్ బాటిళ్లపైనా అంత బ్యాక్టీరియా ఉంటుంది. చేతులు కడగకుండా బాటిళ్లను వాడడం, తరచూ క్లీన్ చేయకపోవడం వల్లే.. దానిపై బ్యాక్టీరియా పెరుగుతుంది. బాటిల్ నెక్‌పైనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అలాంటి నీటిని తాగితే హైపటైటి్‌స-ఏ వంటి రోగాలు వస్తుంటాయి. అంతేకాదు ప్లాస్టిక్ బాటిళ్లకు వేడి తగిలినా, ఆక్సిజన్‌తో చర్య జరిపినా.. అతి ప్రమాదకర రసాయనాలను విడుదల చేస్తాయి. అవి ఒక్కోసారి నీటిలో కలిసిపోతుంటాయి.
బాటిల్ కింది బాగాన ఉండే గుర్తు.. అది ఏ మెటీరియల్‌తో తయారైందో తెలియజేస్తేంది. ట్రయాంగిల్ ఆకారంలో 1 అని ఉంటే.. దాన్ని పాలీఇథైలీన్ టెరిఫ్తలేట్ (పీఈటీ)తో తయారుచేసినట్లు. అలాంటి బాటిల్‌ను ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. ఇక ట్రయాంగిల్‌లో 3 లేదా 7 ఉంటే .. ఆ బాటిల్ పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) తయారుచేసినట్లు. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే.. అది విడుదల చేసే ప్రమాదకర రసాయనాలు మనం తినే ఆహారం, నీటిలో కలిసిపోతాయి.ట్రయాంగిల్‌లో 2 లేదా 4 ఉంటే అవి పాలిఇథైలీన్‌తో తయారుచేశారని భావించాలి. 5 అని ఉంటే పాలీప్రొపైలీన్‌తో తయారైన బాటిళ్లు. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉపయోగించేందుకు 2, 4, 5 రకం బాటిళ్లు కొంత వరకు శ్రేయస్కరం. అయితే ఈ బాటిళ్లను కూడా వెనిగర్, యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్‌లతో తరచూ క్లీన్ చేస్తూ ఉండాలి. ఒక్కోసారి బాటిల్ నీరు, మన ఇంటి నీరు ఒకేలా ఉంటాయి. మరి అలాంటప్పుడు లీటర్‌కు 20 నుంచి 30 రూపాయలు పెట్టి.. బాటిల్ నీరు కొనడం అవసరమా? పైగా అవి రసాయనాలతో తయారైన బాటిళ్లు. డబ్బులిచ్చిమరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం అవసరమా?