గర్భం దాల్చినవారు బొప్పాయి పండు తినొద్దని ఇంట్లో పెద్దవారు, వృద్ధులు చెబుతుంటారు. గర్భవతులు బొప్పాయి పండు తింటే గర్భస్రావం అవుతుందని చెబుతారు. కానీ ఇది అపోహమాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయి పండు తింటే గర్భవతులకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. తల్లీతోపాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా అవసరమయ్యే విటమిన్లు బొప్పాయిలో ఉంటాయి. ఇందులో విటమిన్-ఎ, సిలతో పాటు ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.బొప్పాయి పండును గర్భవతులు నిశ్చింతగా తినొచ్చు. కాకపోతే.. చిన్న జాగ్రత్త తీసుకోవాలి. బొప్పాయి అనంగనే ఏది పడితే అది తినొద్దు. బాగా పండిన బొప్పాయి పండును మాత్రమే గర్భినులు తినాలి. పచ్చిగా ఉన్నది, పూర్తిగా పండని బొప్పాయిని తినొద్దు. ఎందుకుంటే.. పండని బొప్పాయిలో పపాయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భసంచిని బాగా ముడుచుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పచ్చిది, దోర దోరగా పండిన బొప్పాయిని గర్భినులు తినకూడదు.