Home / EDITORIAL / కేసీఆర్ కు వరుణ దేవుడి ఆశీస్సులు..!

కేసీఆర్ కు వరుణ దేవుడి ఆశీస్సులు..!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక పర్యటనల సందర్భంగా జరుగుతున్న వాతావరణ మార్పులు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తున్నయి . ప్రకృతిని అమితంగా ప్రేమించే ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరుణదేవుడి ఆశీస్సులు అందుతున్నయనే భావన కలుగుతున్నది. ఆయన సభలకు ముందు స్వాగతం చెబుతున్నట్లుగా వర్షం రావడం … సభ జరిగే సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా వాన ఆగిపోవడం … సభ పూర్తయిన తర్వాత మళ్ళీ వర్షం రావడం జరుగుతున్నది . ఈ నెల 11 న సిద్ధిపేట సభ రోజు ఉదయం అక్కడ వర్షం పడ్డది . సభ జరిగే సమయంలో ఎలాంటి అంతరాయం కలగలేదు . సభ ముగిసిన తర్వాత మళ్ళీ వర్షం కురిసింది . అదే రోజు సిరిసిల్ల లో సాయంత్రం జరిగిన సభ కు ముందూ తర్వాత వర్షం పడ్డది . సభ సమయంలో ఇబ్బంది కలగలేదు . ఆ రోజు రాత్రి సిరిసిల్ల నుండి సీఎం ఎర్రవెల్లికి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు . మరుసటి రోజు మధ్యాహ్నం సూర్యాపేటలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది . అయితే గజ్వేల్ లో వర్షం పడి ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ లో బయలుదేరే సమయానికి వాతావరణం పూర్తిగా సహకరించింది . సూర్యాపేటలో కలెక్టరేట్ శంకుస్థాపన , ఇతర ప్రారంభోత్సవాల తర్వాత బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు . అక్కడ వర్షం పడుతుందేమోనని అందరూ అనుకున్నరు . కానీ అక్కడ బహిరంగ సభ జరిగే సమయంలో ఒక్క చినుకు కూడా పడలేదు . కానీ సభాస్థలికి ఒక కోలోమీటరు దూరంలో ఉన్న నకిరేకల్ వైపు జోరుగా వర్షం కురిసింది . మొన్న వరంగల్ సభలో పాల్గొని హెలికాఫ్టర్ లో హైదరాబాద్ కు చేరుకున్న సమయంలో ఎల్ బి నగర్ , దిల్ సుఖ్ నగర్ , అంబర్ పేట్ వరకు సిటీ లోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది కానీ బేగంపేట ఎయిర్ ఫోర్ట్ ప్రాంతంలో వర్షం పడలేదు .

ప్రగతిభవన్ లో సింగరేణి కార్మికుల మీటింగ్ రోజు , గత ఏడాది నల్గొండ జిల్లా లోయపల్లి సభ సమయంలోనూ ఇలాగే జరిగింది . ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకృతి ప్రేమికుడు . వర్షం పడితే ఆయన పసిపిల్లాడిలా సంబరపడి పోతారు . వర్షాలు కురిసే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదయిందో రెండు మూడు మార్గాల్లో సమాచారం తెప్పించుకుని సంతోషపడుతరు . ఎక్కడ బహిరంగ సభ జరిగినా కనీసం ఇంటికి ఆరు మొక్కలు నాటాలని అదే మీరు నాకిచ్చే బహుమతి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తరు . తెలంగాణ లో హరితహారం వరుణదేవుడికి , సూర్యభగవానుడికి ఆయన భక్తితో రూపొందించిన కార్యక్రమంగా అనిపిస్తుంది . పైగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన నిర్వహించిన అయుత మహా చండీ యాగం వల్ల గత ఏడాది గోదావరి నదీ జలాశయాలు పరవళ్లు తొక్కినయి . ఈ ఏడాది గోదావరితో పాటు కృష్ణమ్మ ఉరకలెత్తుకుంటూ ప్రవహించింది . శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నయి .

ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలానికి ప్రకృతి తో పాటు ఆ దేవతా మూర్తుల అనుగ్రహం లభిస్తున్నది . ఇప్పుడు నిండిన ప్రాజెక్టులతో కనీసం రెండు మూడు పంటలకు ఇబ్బంది లేదు . ఈ లోపు తెలంగాణ కు ప్రాణధార అయిన కాళేశ్వరంతో పాటు పాలమూరు ప్రాజెక్టులు , డిండి , సీతారామ వంటి ప్రాజెక్టులు ఒక కొలిక్కి రానున్నయి . అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రకృతి కూడా సహకరిస్తున్నది . నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ దాదాపుగా ఎనిమిది గంటల పాటు జరిగింది . ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇంత ఓపిక ఎక్కడి నుండి వస్తున్నది అని కొంత మంది ఐ ఏ ఎస్ అధికారులు చర్చించుకోవడం కనిపించింది . ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం , అందరినీ గౌరవించే మనస్తత్వం , ఒకప్పటి ఉద్యమ స్ఫూర్తి , ఇప్పుడు అభివృద్ధి విషయంలోనూ అదే ఉద్యమ పంధా వీటన్నింటి కంటే ముఖ్యంగా మూడున్నర కోట్ల మంది ఆశీస్సులు సీఎం కేసీఆర్ ను ఉద్యమప్రగతి స్పూర్తితో ముందుకు నడిపిస్తున్నయి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat