హీరో హీరోయిన్లు కలిసిన సీన్‌తో సినిమాను ఎండ్ చేస్తారు. ఆ తరువాత ఏం జరిగిందన్న విషయంపై కాస్త కూడా కథ ఉండదు.కథ మధ్యలో తన ప్రేమను దక్కించుకోవడం కోసం హీరో ఏం చేసినా జనాలకు నచ్చుతుంది. తప్పు చేసినా.. కుటుంబాన్ని ధిక్కరించినా.. ఉన్మాదిలా ప్రవర్తించినా.. హీరోయిన్ కోసం ఎంతో కష్టపడుతున్నాడని అంటారే కానీ.. వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకోరు. ఉదాహరణకి అర్జున్‌రెడ్డి సినిమానే తీసుకుందాం.. ఆ చిత్రంలో హీరోకి చాలా పొగరు. తను చేసిందే కరెక్ట్, తను చెప్పిందే వేదాంతం అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. తన అలవాట్లు, ఎమోషన్స్ పట్ల తనకే ఒక సెల్ప్ కంట్రోల్ లేకుండా అప్పటికప్పుడు బుర్రకు ఏది తోస్తే అది చేస్తూ చూసిన వారికి ఉన్మాది అనే భావన కనిపించేలా ప్రవర్తిస్తాడు.
తమ ప్రేమను ఒప్పుకోలేదని హీరోయిన్ తండ్రిని కూడా నోటికొచ్చిన మాటలు అంటాడు. ఇక ఆమె దగ్గరయ్యాక అతను చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన ఫ్యామిలీని వదిలేసి మందుకు బానిస అవుతాడు. తన ప్రేయసిని మర్చిపోవడం కోసం వేరే అమ్మాయిలతో పడక గది పంచుకుంటాడు. చివరికి ఓ హీరోయిన్‌ను కూడా బుట్టలో పడేస్తాడు. అవన్నీ జనాలకు బాగా నచ్చాయి. ఏదైతేనేం చివరికి ఎలాగోలా హీరో హీరోయిన్ కలిసిపోతారు. హ్యాపీ ఎమోషన్స్ తో సినిమాకి శుభం పలికారు.
మరి ఆ తరువాత ఏం జరిగింది..? వారిద్దరి కాపురం ఎలా సాగింది..? తనకు ఇష్టం వచ్చినట్లు చేసే భర్తతో హీరోయిన్ తన తదుపరి జీవితం ఎలా గడిపింది..? ప్రియురాలి నుంచి భార్యగా మారిన ఆ హారోయిన్ తన భర్త ప్రవర్తన పట్ల ఇప్పుడు ఏ అభిప్రాయంతో ఉంది..? అసలు వారి పిల్లల పెంపకం ఎలా ఉంది..? వారి ఎదుగుదల ఎలా ఉంది..? అన్న అంశాలను మాత్రం చూపించలేదు. ఆ అంశాలన్నింటిని అర్జున్‌రెడ్డి పార్ట్ – 2లో తీస్తే మొదటి భాగంలాగానే బ్లాక్ బస్టర్ అవుతుందా..? లేక ఫట్ మంటుందా..? వేచి చూడాలి.