వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ నెల 23న జరగనున్నట్లు ప్రకటించిన పార్టీ శాసనసభాపక్ష సమావేశం 26వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 10:30 గంటలకు తమ శాసనసభ్యులతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేస్తారు.