అరువై ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా, ఈ మూడేండ్లలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, అందరి కండ్లల్ల్లో ఆనందం నింపిన టీఆర్ఎస్కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు, సీనియర్ నాయకుడు బాషా రెండువేల మంది కార్యకర్తలతో మంత్రి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. అభివృద్ధిని చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు.
రూ.40 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు..
మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ: మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రూ.2.70 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సోమా భరత్‌కుమార్ అభినందన సభలో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా రూ.40 వేల కోట్లతో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ఎన్ భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.